క‌ర్రీలో ఇంత వాటరా..?

by Ratna Kumari |

విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో కూరల్లో ఇంత నీళ్లు నీళ్లా..? వంట ఇష్టానుసారంగా చేస్తే సహించేది లేదని కలెక్టర్ కే హైమావతి మధ్యాహ్న భోజన సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

క‌ర్రీలో ఇంత వాటరా..?
X

దిశ, సిద్దిపేట అర్బన్ : విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో కూరల్లో ఇంత నీళ్లు నీళ్లా..? వంట ఇష్టానుసారంగా చేస్తే సహించేది లేదని కలెక్టర్ కే హైమావతి మధ్యాహ్న భోజన సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని రంఘధాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేసీఆర్ నగర్ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అన్నం, కూరగాయలను పరిశీలించి కూరలు నీళ్లు నీళ్లు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం.. ఆహార పదార్థాలు వేశారా? లేకుంటే మీ ఇష్టానుసారంగా వేశారా అని వంట సిబ్బంది, ప్రిన్సిపాల్ పైన మండిపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఒక్క విద్యార్థికి ఆహార పదార్థాలు ఎంత పరిమాణం అందించాలో అదే ప్రామాణికంగా అందించాలన్నారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేస్తూ మెను ప్రకారం విద్యార్థులకు ఉదయం టీఫీన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం సరుకులు వివరాలు ఇవ్వగానే రిజిస్టర్ లో రాయాలని ఇష్టానుసారంగా తప్పుల తడకగా రాస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం కిచెన్ గార్డెన్ పరిశీలిస్తూ మునగ మొక్కలు నాటాలని మునగ చెట్టు సంబంధించి ప్రతిదీ కూరల్లో ఉపయోగించాలని తెలిపారు. అదే విధంగా కేసీఆర్ నగర్ లోని బస్తీ దవాఖాన ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ రెండు చోట్ల విధులు నిర్వహిస్తున్నట్లు మధ్యాహ్నం 12 గంటలకు ఇంకో పీహెచ్ సీ వెళ్ళారని సిబ్బంది వెల్ల‌డించారు.

Next Story