స‌బ్సీడీ వ్య‌వ‌సాయ ప‌రికరాల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి : ఏవో లక్ష్మీ ప్ర‌వీణ్

by Ratna Kumari |   (  Updated:2025-11-15 11:04:52  IST  )

దిశ, చిన్న‌శంక‌రంపేట : చిన్నశంకరంపేట మండలంలోని ఆయా కులాలకు చెందిన అర్హత కలిగిన రైతులు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పొందేందుకు వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని

స‌బ్సీడీ వ్య‌వ‌సాయ ప‌రికరాల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి : ఏవో లక్ష్మీ ప్ర‌వీణ్
X

దిశ, చిన్న‌శంక‌రంపేట : చిన్నశంకరంపేట మండలంలోని ఆయా కులాలకు చెందిన అర్హత కలిగిన రైతులు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పొందేందుకు వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఏవో లక్ష్మీ ప్రవీణ్ ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ ప్లేయర్స్ , రోటవేటర్స్, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ వంటి వాటికోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. అర్హత గల రైతులు ఈనెల 20వ తేదీ లోపు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రెండు పాస్ పోర్టు ఫోటోలు దరఖాస్తు ఫారం కి జతచేసి వ్యవసాయ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Next Story