- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మెదక్ > నిబంధనల ప్రకారం ధృవీకరణ పత్రాలకు దరఖాస్తులు చేయాలి : టీఎస్ టీఎస్ జిల్లా మేనేజర్ ప్రదీప్ కుమార్
నిబంధనల ప్రకారం ధృవీకరణ పత్రాలకు దరఖాస్తులు చేయాలి : టీఎస్ టీఎస్ జిల్లా మేనేజర్ ప్రదీప్ కుమార్
by Ratna Kumari |
దిశ, నారాయణఖేడ్ : నియమ నిబంధనల ప్రకారం కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయబడాలంటే వినియోగదారులు సరైన విధంగా దరఖాస్తులు చేయాలని టీఎస్ టీఎస్ జిల్లా

X
దిశ, నారాయణఖేడ్ : నియమ నిబంధనల ప్రకారం కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయబడాలంటే వినియోగదారులు సరైన విధంగా దరఖాస్తులు చేయాలని టీఎస్ టీఎస్ జిల్లా మేనేజర్ ప్రదీప్ కుమార్ అన్నారు. బుధవారం నారాయణఖేడ్ పట్టణంలోని మీసేవా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాలలో అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీసేవా నిర్వాహకులతో మాట్లాడుతూ… ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులు కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారని, వాటిని పరిశీలించే సమయంలో ఎటువంటి లోపాలు లేకుండా నియమ, నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులు చేయాలని తెలిపారు. వినియోగదారులు మీసేవా కేంద్రాలకు విచ్చేసినప్పుడు వారికి మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మీసేవ నిర్వాహకులు సయ్యద్ షరీఫ్, ఆపరేటర్ నవీన్ పాల్గొన్నారు.
Next Story






