- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ గెలవడం ఖాయం.. కే.హెచ్.మునిఅప్ప
తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అని ఎఐసీసీ జహిరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ కేహెచ్. మునిఅప్ప అన్నారు.

దిశ, నారాయణఖేడ్ : తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అని ఎఐసీసీ జహిరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ కేహెచ్. మునిఅప్ప అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ పట్టణంలోని స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ 75 సీట్లకు పైగా గెలుస్తాయని , కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి జరుగుతుందని, కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు. 9 సంవత్సరాల్లో నిరుద్యోగ సమస్య పేరుకుపోయిందని, యువకులు నమ్మే ప్రసక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్లోల సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి, షాదుల్లా, యూత్ కాంగ్రెస్ నాయకులు లోకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






