- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యమకారులకు 250 గజాల ప్లాట్లు ఇవ్వాలి..
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ప్లాట్లు పంపిణీ చేసేందుకు ఉప్పల్ బగాయత్‌లో ఉన్న 350 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్)పిలుపునిచ్చింది.

దిశ, సంగారెడ్డి అర్బన్: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ప్లాట్లు పంపిణీ చేసేందుకు ఉప్పల్ బగాయత్‌లో ఉన్న 350 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్)పిలుపునిచ్చింది. ఈ మేరకు జూలై 2న నిర్వహించే భూపోరాటాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు.తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం సంగారెడ్డిలోని త్రిశూల్ బ్యాంక్వెట్ హాల్‌లో రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రక్షణ సేన సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కలబుగూర్ దయాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పరిశీలకులు వేముల భవాని, శివశంకర్, కవిత నర్సింలు, ప్రమోద్ ముఖ్య అతిథులుగా హాజరై భూపోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలనిఉద్యమకారులకు పిలుపునిచ్చారు.
ఉద్యమాన్ని విజయవంతం చేయాలి..
ఈ సందర్భంగా కలబుగూర్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జూలై 2న జరిగే భూపోరాటంలో వేలాదిగా ఉద్యమకారులు పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈసమావేశంలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య, ఎం. శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్, కృష్ణమోహన్, సాయికాంత్, నితిన్ కుమార్, నర్సింలు, నాగరాజు, తెలంగాణ ఉద్యమకారుల సంఘం 1968 అధ్యక్షుడు సుభాష్ చంద్ర, నర్సింలు, గోవర్ధన్, కిషన్ రావు, మలిదశ ఉద్యమకారులు నంద కిషోర్, త్రివిక్రమార్క, బొట్టు వెంకటేశం, నామాల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.






