బ్యాటరీల దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

by Ratna Kumari |

దిశ, గజ్వేల్ రూరల్ : బ్యాటరీల దొంగతనం కేసులో నిందితుడితో పాటు చోరీ సోత్తును కొనుగోలు చేసిన నిందితులను అరెస్ట్ చేసి నిందితుల నుంచి 25 బ్యాటరీలను, రూ.1,85,000 నగదును స్వాధీనం

బ్యాటరీల దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
X

దిశ, గజ్వేల్ రూరల్ : బ్యాటరీల దొంగతనం కేసులో నిందితుడితో పాటు చోరీ సోత్తును కొనుగోలు చేసిన నిందితులను అరెస్ట్ చేసి నిందితుల నుంచి 25 బ్యాటరీలను, రూ.1,85,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ వి.రవికుమార్ తెలిపారు. గజ్వేల్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాయపోల్ మండలం పెద్ద ఆరెపల్లికి చెందిన దుర్గం విక్రమ్ గౌడ్ అనే నిందితుడు ప్రజ్ఞాపూర్ లోని కార్తికేయ ఇ-వెహికల్స్ లో గోడౌన్ ఇన్‌చార్జి గా పనిచేస్తున్నాడు. ఇతను గోడౌన్ నుండి బ్యాటరీలను దొంగిలించి, తక్కువ ధరలకు కొనుగోలుదారులకు విక్రయించాడు. ఈ సందర్బంగా కార్తికేయ ఇ - వెహికల్స్ యజమాని మహిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజ్వేల్ టౌన్ పోలీసు కేసు నమోదు చేశారు. గజ్వేల్ ఏసీపీ నర్సింహులు పర్యవేక్షణలో, గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ చెట్టుకింది ముత్యం రాజు మరియు బృందం - ఏఎస్ఐ యాదగిరి, కానిస్టేబుళ్లు ఆర్. వెంకటేష్, ఎం. నరేందర్, రవి, సురేందర్, నగేష్ మరియు మహిళా కానిస్టేబుల్ దివ్యలు సమర్థవంతంగా దర్యాప్తు చేసి, దొంగతనం రాత్రి గృహ చోరీకి పాల్పడిన నిందితుడితో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తులను సైతం అరెస్టు చేశారు.


నిందితుడి వద్ద నుంచి రూ. 85 వేలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిదంగా దొంగిలించిన బ్యాటరీలను కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కుకునూరుపల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన కొనుగోలు దారుడు ఘనపురం వెంకటేశం దుకాణం నుంచి రూ.65 వేలను రికవరీ చేసి 5 బ్యాటరీ సెట్లు (ENGTIAN 12V 32Ah) - మొత్తం 25 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన కుక్కల శేషు అతని మెకానిక్ షాప్ నుంచి రూ.35 వేలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా దొంగతనం మరియు చోరీ సొత్తు కొనుగోలుకు సంబంధించిన కేసుల్లో నిందితుల నుంచి మొత్తం రూ.1 లక్ష 85 వేల నగదును మరియు 25 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో అద్భుతమైన కృషి చేసిన గజ్వేల్ పోలీసు బృందాన్ని ఏసీపీ నరసింహులు అభినందించారు.

Next Story