- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు బ్రిడ్జీ పై నుంచి కిందపడి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు బ్రిడ్జీ పై నుంచి కింద పడి వ్యక్తి చెందిన సంఘటన నంగునూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ, నంగునూరు : ప్రమాదవశాత్తు బ్రిడ్జీ పై నుంచి కింద పడి వ్యక్తి చెందిన సంఘటన నంగునూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెరుమని మల్లయ్య(73) మార్చి 30న అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఈ క్రమంలో నంగునూరు బస్టాండ్ వద్ద ఉన్న బ్రిడ్జి పక్కన గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నాడని గుర్తించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకొని చూసేసరికి పేరుమని మల్లయ్య బ్రిడ్జి కింద మురికి నీటిలో పడి మృతి చెంది ఉన్నాడని తెలిపారు. బ్రిడ్జి పై నుంచి కింద ప్రమాదవశాత్తు పడిపోయాడా ఎవరైనా తోసేసారా అని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై రాజగోపాల్ పేట పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.






