నిజాయితీని చాటుకున్న మహిళ

by Bhanu |

బొల్లారం డివిజన్ పరిధిలో ఓ మహిళ తన నిజాయితీని చాటుకుంది. సుమారు 5 లక్షల విలువ చేసే వస్తువులను తిరిగి అందజేసింది.

నిజాయితీని చాటుకున్న మహిళ
X

దిశ, జిన్నారం: బొల్లారం డివిజన్ పరిధిలో ఓ మహిళ తన నిజాయితీని చాటుకుంది. సుమారు 5 లక్షల విలువ చేసే వస్తువులను తిరిగి అందజేసింది. ఈ విషయంపై బొల్లారం పోలీసులు ఆమని ప్రశంసించారు. జిన్నారం మండలం బొల్లారం డివిజన్ పరిధిలో నుంచి హనుమకొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కవిత అనే మహిళ హ్యాండ్‌బ్యాగ్ కనిపించకుండా పోయింది. బస్సు రద్దీ కారణంగా వెతికినా దొరకకపోవడంతో ఆమె తిరిగి బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

బ్యాగులో నాలుగు తులాల బంగారం, పాసుబుక్‌లు ఉన్నాయని తెలిపింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇదే సమయంలో బొల్లారంకి చెందిన మంజుల అనే మహిళకు ఆ బ్యాగ్ దొరికింది. బ్యాగులో ఉన్న ఫోన్ నెంబర్ను చూసి మంజుల కవితను సంప్రదించింది. సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే బ్యాగ్‌ను పోలీసులు సమక్షంలో తిరిగి కవితకు అందించింది.ఈ నిజాయితీ చర్యపై సీఐ రవీందర్ రెడ్డి, పోలీసుల బృందం మంజులను అభినందించారు.

Next Story