- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముత్తూట్ మోసం.. తాళం వేసిన బాధితుడు..!
వడ్డీతో సహా డబ్బులు చెల్లించిన, తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన బాధితుడు ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంకు తాళం వేసిన ఘటన బుధవారం ఇస్నాపూర్‌లో కలకలం రేపింది.

దిశ, పటాన్ చెరు టౌన్: వడ్డీతో సహా డబ్బులు చెల్లించిన, తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన బాధితుడు ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంకు తాళం వేసిన ఘటన బుధవారం ఇస్నాపూర్‌లో కలకలం రేపింది. ముత్తంగి గ్రామానికి చెందిన సాయి జీవన్ కుమార్ ఇటీవల ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం తాకట్టు పెట్టి 9.51 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీన బాకీ మొత్తం చెల్లించడానికి ముత్తూట్ ఫైనాన్స్‌కు వెళ్లి మేనేజర్‌తో మాట్లాడి, ఆయన సలహా మేరకు ముత్తూట్ ఫైనాన్స్ అకౌంట్ కి 9.51 లక్షలతో పాటు వడ్డీ మొత్తం తన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆర్టీజిఎస్ చేశాడు.
కానీ బాధితుడికి బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో పలుమార్లు మేనేజర్‌ను కలిసి విన్నవించినా సరైన సమాధానం లేకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు ఫైనాన్స్ కు చేరుకొని ప్రశ్నించగా మేనేజర్ రాలేదని చెప్పడంతో సిబ్బందిని నిలదీసినా సరైన సమాధానం లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన బాధితుడు తాను చెల్లించిన డబ్బుకు సరైన సమాధానం కావాలంటూ ఫైనాన్స్ ప్రధాన ద్వారానికి తాళం వేశాడు. దీంతో బ్యాంకు సిబ్బంది పటాన్ చెరు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం తీయించి సిబ్బందిని బయటకు పంపించారు.
కాగా ఇంత పెద్ద మొత్తం మేనేజర్ సలహాతో ముత్తూట్ ఫైనాన్స్ కు ట్రాన్స్ఫర్ చేసిన మేనేజర్‌తో పాటు సిబ్బంది కూడా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని తనకు ప్రత్యామ్నయం లేకే ఫైనాన్స్ కు తాళం వేశానని బాధితుడు తెలిపాడు. కాగా లోపల మహిళ ఉద్యోగులు కూడా ఉండటం, ఫోటోలు తీస్తున్న మీడియాపై వారు దురుసుగా ప్రవర్తించడంతో పలువురు స్థానికులు బ్యాంక్ సిబ్బందిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జరిగిన సంఘటనపై మేనేజర్‌కు వివరణకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాకపోవడం, సిబ్బంది కూడా మీడియాపై దురుసుగా మాట్లాడటం గమనార్హం.
- Tags
- medak






