- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రహదారిపై ధాన్యం సంచులు పెట్టి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తి అరెస్ట్
దిశ, మిరుదొడ్డి : రహదారిపై నిర్లక్ష్యంగా ధాన్యం సంచులు నిలిపి ఉంచడంతో వాటిని ఢీ కొన్న వ్యక్తి మరణానికి కారణమైన వ్య

దిశ, మిరుదొడ్డి : రహదారిపై నిర్లక్ష్యంగా ధాన్యం సంచులు నిలిపి ఉంచడంతో వాటిని ఢీ కొన్న వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్ తెలిపారు. శనివారం భూంపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 12న అక్బర్ పేట - భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన మటన్ దుకాణాన్ని నిర్వహించే గజబింకార్ ఈశ్వర్ లాల్(48) తన గ్రామం నుంచి రాత్రి తొమ్మిదిన్నరకు అక్బర్ పేటకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. భూంపల్లి పీహెచ్ సీ సమీపంలో రహదారిపై నలుపు రంగు ప్లాస్టిక్ కవర్లతో కప్పబడిన వడ్ల సంచులను ఢీ కొని, అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రహదారిపై నిర్లక్ష్యంగా వడ్ల సంచులను ఉంచి, ఒక వ్యక్తి మరణానికి కారణమైన కాపర్ల మైసయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి, శనివారం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో భూంపల్లి ఎస్సై హరీష్ గౌడ్ పాల్గొన్నారు.






