- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కు ఘన నివాళి...
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతిని శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

దిశ,సంగారెడ్డి అర్బన్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతిని శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య తెలంగాణ రైతాంగ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన త్యాగం, ధైర్యసాహసాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దొరల దురహంకారంపై తిరుగబడి ప్రాణాలు అర్పించిన కొమరయ్య జీవితం నేటి తరానికిస్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ కుల సంఘాల నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని అమరుడు దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించారు.






