ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం

by Bhanu |

విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆ సంఘం, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి అన్నారు

ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం
X

దిశ, నర్సాపూర్: విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆ సంఘం, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి అన్నారు. మెడివిజన్ కంటి ధవాఖానా, హైదరాబాద్ సౌజన్యంలో నర్సాపూర్ రైతు వేదికలో విశ్రాంత ఉద్యోగుల సంఘం, మండల శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరo ఏర్పాటు చేశారు. శిఖరంలో విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు డి. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సి. గంగారాం, ఆర్ధిక కార్యదర్శి యాకుబ్,అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ జహీరోద్దీన్,ఉపాధ్యక్షులు జి. విట్టల్, జి. రుక్కమ్మ, జాయింట్ సెక్రటరీ జి. లింగా రెడ్డి,ఆర్గనైసింగ్ కార్యదర్శి సోని భాయ్,పబ్లిసిటీ సెక్రటరీ యం. నర్సిములు, జిల్లా కౌన్సిల్లర్లు ఆర్ ఊర్మిళ, జి.నర్సిములు, పి, సత్యనారాయణ, సీనియర్ సభ్యులు మల్లారెడ్డి, క్రియాశిలా సభ్యులు ధన్సింగ్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Next Story