- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మెదక్ > ఎన్నికల్లో అవినీతి రహిత పాలక వర్గాన్ని ఎన్నుకోవాలి : జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్
ఎన్నికల్లో అవినీతి రహిత పాలక వర్గాన్ని ఎన్నుకోవాలి : జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్
by Ratna Kumari |
ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును వినియోగించుకొని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి రహిత పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు.

X
దిశ, చేర్యాల : ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును వినియోగించుకొని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి రహిత పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. గురువారం చేర్యాల జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయి ఎన్నికలు కావని ఇవి కేవలం గల్లీ స్థాయి ఎన్నికలు మాత్రమే కాబట్టి ప్రజా సమస్యలపై అవగాహన ఈ ప్రాంత అవసరాల కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసే నాయకులకే పట్టం కట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ జేఏసీ నాయకులు అందె అశోక్, బుట్టి సత్యనారాయణ, గడిపే బాల నర్సయ్య, పోలోజు వెంకటాద్రి, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, చందా శ్రీకాంత్ పాల్గొన్నారు.
Next Story






