- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ ఇసుక రవాణాకు చెక్
by Kema Shiva Kumar |
'మిరుదొడ్డిలో ఇసుక దందా' అనే శీర్షికతో ఏప్రిల్ 23 న 'దిశ' పత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది.

X
తహసీల్దార్ ఉదయశ్రీ విచారణ షురూ
దిశ, మిరుదొడ్డి: 'మిరుదొడ్డిలో ఇసుక దందా' అనే శీర్షికతో ఏప్రిల్ 23 న 'దిశ' పత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. మండల తహసీల్దార్ ఉదయశ్రీ విచారణ చేపట్టి అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. దీంతో నాగయ్య వాగు పరిసర ప్రాంతాలలో పరిశీలించగా అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపులు దర్శనం ఇచ్చాయి. తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గ్రామ వీఏవోలతో కలిసి ఇసుక డంపులను పరిశీలించి వాటిని పలువురు సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేశారు.
Next Story






