- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ ను ఢీకొట్టిన బస్సు.. వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
బైక్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్త దుర్మరణం పాలైన ఘటన హుగ్గెల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, జహీరాబాద్: బైక్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్త దుర్మరణం పాలైన ఘటన హుగ్గెల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిగవ్వల్ గ్రామానికి చెందిన బేగరి రవి కుమార్(32) సోమవారం సాయంత్రం బైక్ పై జహీరాబాద్ కు వెళ్లి పూజ సమాన్లు తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ హుగ్గెల్లి క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రవికుమార్ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికుమార్ తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య బేగరి కాజల్ ఫిర్యాదు మేరకు జహీరాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






