- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెదక్ జిల్లాలో 97.8 శాతం పల్స్ పోలియో లక్ష్యం పూర్తి
మెదక్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ తెలిపారు.

దిశ, మెదక్ టౌన్ : మెదక్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐదేళ్ల లోపు 75,496 మంది చిన్నారులకు లక్ష్యంగా పెట్టుకోగా, 73,643 మందికి పోలియో చుక్కలు వేసి 97.8 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడించారు. జిల్లాలోని 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 157 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల పరిధిలో మొత్తం 457 పోలియో బూతులు, 46 మొబైల్ రూట్లు, 20 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటు చేసి 872 బృందాలు, 1,828 మంది సిబ్బంది సేవలందించినట్లు తెలిపారు. పోలియో బూత్‌ల వద్ద చుక్కలు వేయించుకోని ఐదేళ్ల లోపు చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఒక్క చిన్నారి కూడా మిగలకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పర్యవేక్షణ చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర పల్స్ పోలియో పరిశీలకులు డా. అరుణ్, జాయింట్ డైరెక్టర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, అదనపు కలెక్టర్ నగేష్, డీసీహెచ్‌ఎస్ డా. శివ దయాళ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. జయశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డా. సృజన, డా. హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, జర్నలిస్టులు, ఆరోగ్య సిబ్బంది, ప్రజలకు డీఎంహెచ్‌ఓ డా. గణేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.






