- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
39 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతి : ఎస్పీ రమణకుమార్
by Kema Shiva Kumar |
సంగారెడ్డి జిల్లాకు చెందిన 39 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ , సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాకు చెందిన 39 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత కొంత కాలంగా ప్రమోషన్స్ గురించి ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు హెడ్-కానిస్టేబుళ్లుగా ప్రమోషన్స్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
కోవిడ్ సమయంలో కూడా ఎన్నో విపత్కర పరిస్థితులలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సోషల్ సర్వీస్ చేస్తూ, తమ విధులను సక్రమంగా నిర్వహించారని కొనయాడారు. అదేవిధంగా సుధీర్గ సర్వీసులో ఎలాంటి రిమార్క్ లేకుండా తమ భాధ్యతను నిర్వర్తించి, హెడ్-కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు. హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ తో భాధ్యత మరింత పెరిగిందని గుర్తుచేశారు. పదోన్నతి పొందిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story






