- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాణ్యత లోపంతో కుంగిన 365బీ హైవే రోడ్డు
నాణ్యత లోపంతో కుంగిన రోడ్డు 365B హైవే ప్రమాదాలకు నిలయంగా మారిందని DYFI సిద్ధిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా చేర్యాల మండలం తాడురు క్రాసింగ్, కొమురవెల్లి మండలం మర్రిముచాలలో కుంగిన రోడ్డును బుధవారం పరిశీలించారు.

X
దిశ, కొమురవెల్లి : నాణ్యత లోపంతో కుంగిన రోడ్డు 365B హైవే ప్రమాదాలకు నిలయంగా మారిందని DYFI సిద్ధిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా చేర్యాల మండలం తాడురు క్రాసింగ్, కొమురవెల్లి మండలం మర్రిముచాలలో కుంగిన రోడ్డును బుధవారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాహనదారులకు కల్వర్ట్ దగ్గర కుంగి ఉన్న రోడ్డు కనిపించకపోవడం వలన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని,ఇలా అనేక ప్రమాదాలు జరిగాయని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా R&B అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని యెడల రోడ్డు పై ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DYFI జిల్లా సహాయకార్యదర్శి తడూరి ప్రవీణ్, జిల్లా నాయకులు గుండె పవన్ కళ్యాణ్, భాను పాల్గొన్నారు.
Next Story






