- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత
30 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకున్న సంఘటన తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, తూప్రాన్ : 30 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకున్న సంఘటన తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తూఫ్రాన్ పేట టోల్ గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేపడుతున్న సమయంలో ఓ లారీ అనుమానస్పదంగా కనిపించడంతో ఆపి పరిశీలించగా.. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ కి చెందిన బియ్యం ఉన్నట్టు అనుమానం రావడంతో వెంటనే లారీని పోలీస్ స్టేషన్ కి తరలించి పరిశీలించగా పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. లారీ డ్రైవర్ ను విచారించగా.. ఆ వాహనం హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్నట్టు తెలిపాడు. డ్రైవర్ జయవీర్ మధ్య ప్రదేశ్ కి చెందిన వ్యక్తి. 30 టన్నులు ఉన్న బియ్యం గురించి సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ద్వారా నిర్థారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం బియ్యం మూలం, రవాణా, చట్టబద్దత, సంబంధిత వ్యక్తుల పాత్ర పై విచారణ కొనసాగుతోంది. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఎస్సై గంగరాజు తెలిపారు.






