డంప్ యార్డు ఆధునీకరణకు రూ.18 కోట్లు

by velandi.Saikiran |

సంగారెడ్డి మున్సిపాలిటీ డంప్ యార్డ్ ఆధునీకరించేందుకు రూ.18 కోట్లు హెచ్ఎండీఏ నిధులు తీసుకువస్తానని జగ్గారెడ్డి

డంప్ యార్డు ఆధునీకరణకు రూ.18 కోట్లు
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ డంప్ యార్డ్ ఆధునీకరించేందుకు రూ.18 కోట్లు హెచ్ఎండీఏ నిధులు తీసుకువస్తానని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల, మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తో కలిసి సంగారెడ్డి డంపుయార్డ్ సమస్యపై కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ సహకారంతో రూ.18 కోట్లు నిధులు మంజూరు చేయిస్తానని నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. చెత్త ను సెగ్రిగెట్ చేయడానికి ఉన్న టెక్నాలజీ, డీపీఆర్ సిద్దంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

చెత్త ను శుద్ధి చేయటానికి హెవీ మిషనరీ అవసరం పడుతుందని అధికారులు వివరించారు. డంప్ యార్డ్ లో ఎప్పటికప్పుడు చెత్తను శుద్ధి చేసే అత్యాధునిక టెక్నాలజీ వినియోగించాలని , అందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న, ఇతర మున్సిపాలిటీ ల్లో అమలవుతున్న పద్దతులను అధ్యయనం చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. డంప్ యార్డ్ నిర్వహణ, చెత్తను శుద్దికరించడానికి అవసరమైన నిధులను తెచ్చేందుకు తాను కృషి చేస్తానని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారుల ను కోరారు.

Next Story