తెలంగాణ డీజీపీ జితేందర్ తో మెదక్ ఎంపీ రఘునందన్ రావు భేటీ!

by Ramesh Goud |

తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP Jithendar) తో మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Medak MP Raghunandan Rao) భేటీ అయ్యారు.

తెలంగాణ డీజీపీ జితేందర్ తో మెదక్ ఎంపీ రఘునందన్ రావు భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP Jithendar) తో మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Medak MP Raghunandan Rao) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివాలయం ధ్వంసం ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. అంతేగాక హైదరాబాద్ లో అశాంతి తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిన్నారం మండలం (Jinnaram Mandalam)లో శివాలయం ధ్వంసం ఘటనలో పోలీసులు సకాలంలో స్పందించలేదని, మధ్యాహ్నం జరిగిన ఘటనపై రాత్రి వరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు.

అలాగే దాడికి పాల్పడిన మదర్సాలోని విద్యార్థులపై చర్యలు తీసుకోలేదు కానీ దాడిపై నిరసన తెలిపిన హిందువులపై నాలుగు ఎఫ్ఐఆర్ (FIRs)లు నమోదు చేశారని వివరించారు. అంతేగాక మదర్సా విద్యార్థులు అక్రమ వలసదారులనే అనుమానం వ్యక్తం చేస్తూ.. వారు హిందూ దేవి, దేవతలపై, దేవాలయాలపై, హిందూ సమాజంపై ద్వేషంతో వ్యవహరించారని తెలిపారు. ఇక శివాలయ ధ్వంసానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీలు (CC TV Futages) ఇంకా బయటకు రాలేదని, మదర్సా పిల్లల జాతీయతపై, వారికి భారతీయ పౌరసత్వం ఉందా అనే అనుమానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ (Intelligence System) విఫలమైందని విమర్శించారు. తెలంగాణలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మూలాల వ్యక్తులు కూడా నివాసం ఉంటున్నారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మోదీ సర్కార్ (Modi Sarkar), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) ఆదేశాల మేరకు చర్యలు తీసుకోకపోతే, భాగ్యనగరంలో అశాంతి తలెత్తే ప్రమాదం ఉందని డీజీపీని రఘునందన్ రావు హెచ్చరించారు.

Next Story