బీజేపీ MP రఘునందన్ రావు అరెస్ట్.. కారణమిదే

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ కీలక నేత, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

బీజేపీ MP రఘునందన్ రావు అరెస్ట్.. కారణమిదే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ(Telangana BJP) కీలక నేత, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు(MP Raghunandan Rao)ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం వెలిమల తండా(Velimela Thanda)లో అదుపులోకి తీసుకున్నారు. అటునుంచి నేరుగా రఘునందన్‌రావును పటాన్‌చెరు పీఎస్‌(Police Station Patancheru)కు తరలించారు. ఉదయం నుంచి గిరిజనులకు మద్దతుగా రఘునందన్‌రావు ఆందోళన నిర్వహించారు. రఘునందన్ రావును అరెస్టు చేసే సమయంలో గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, గిరిజనులకు మధ్య స్వల్పంగా తోపులాట, వాగ్వాదం జరిగింది.

కాగా, వెలిమల భూ వివాదం గత పది రోజులుగా కొనసాగుతున్నది. తమకు న్యాయం చేయాలంటూ గిరిజనులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ గిరిజనుల ఆందోళనకు మద్దతుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రంగంలోకి దిగారు. గిరిజనులకు బీజేపీ అండగా నిలుస్తుందని గురువారం పార్టీ కార్యాలయంలో ప్రకటించిన రఘునందన్ రావు.. శుక్రవారం ఉదయం పార్టీ శ్రేణులతో కలిసి వెలిమల తండాకు చేరుకున్నారు. గిరిజనులతో కలిసి ర్యాలీగా వెలిమల తండా నుంచి సదరు భూముల వద్దకు చేరుకుని గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహించారు.

Next Story