- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DSP Transfer : చర్చనీయాంశంగా మెదక్ డీఎస్పీ రాజేశ్వర్ బదిలీ
మెదక్ డీఎస్పీ డాక్టర్ రాజేశ్వర్ బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ డీఎస్పీ డాక్టర్ రాజేశ్వర్ బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎస్పీ బదిలీ కాగా అదే బాటలో డీఎస్పీ రాజేశ్వర్ బదిలీ కావడం పై సర్వత్రా చర్చ సాగుతోంది. ఎప్పుడూ లేని విధంగా మెదక్‌లో మత కల్లోలాలు జరగడం మూలంగా ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఎస్పీ సైతం బదిలీ అయిన విషయం తెలిసిందే. మెదక్ అల్లర్లకు పోలీస్‌ల నిర్లక్ష్యమే కారణం అనే విమర్శలు ప్రతిపక్షాలు చేశాయి. ఇందులో భాగంగా బదిలీల ప్రక్రియ చేపట్టిన అధికారులు డీఎస్పీ రాజేశ్వర్‌ను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన డీఎస్పీని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మెదక్‌లో జరిగిన అల్లర్ల తర్వాత మెదక్ పరిధిలో ఉన్న అధికారులంతా దాదాపుగా బదిలీ అయ్యారు.
Next Story






