VC Sajjanar: వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వొద్దు! వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్‌ల కట్టడికి చర్యలు తీసుకుంటున్న కూడా యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.

VC Sajjanar: వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వొద్దు! వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వాలు (Betting app) బెట్టింగ్ యాప్‌ల కట్టడికి చర్యలు తీసుకుంటున్న కూడా యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటి బారిన పడి ఎంతో మంది యువత బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన ఓ బీటెక్ విద్యార్థి ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పవన్ (30) హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో నివసిస్తున్నాడు. బెట్టింగ్ యాప్‌కు బానిసగా మారి డబ్బులు పొగొట్టుకోవడంతో వవన్ మానసికంగా కుంగిపోయి బుధవారం సాయంత్రం స్నేహితులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై బెట్టింగ్ యాప్స్‌‌ను కట్టడి చేయాలని పోరాటం చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC Sajjanar) శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వొద్దు. కష్టం వచ్చిందని క్షణికావేశంలో నిండు ప్రాణాన్ని నిమిషంలో తీసుకుని ఏం సాధిస్తారు. బలవన్మరణాలు చేసుకుంటే కష్టాలు, బాధలు పోతాయా? అయినవాళ్ళందరిని వదిలి ఇలా హఠాత్తుగా వెళ్లిపోయాలనే ఆలోచన మంచిది కాదు. చనిపోవడానికి ఒక్కటే కారణం కానీ, బతకడానికి 1000 కారణాలు ఉంటాయని తెలుసుకోండి. బలవన్మరణాలు వద్దు.. బతికి సాధించడమే ముద్దు.’ అని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

Next Story