రాష్ట్రంలో దారుణం.. MBBS స్టూడెంట్ సూసైడ్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌(Adilabad)లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు.

రాష్ట్రంలో దారుణం.. MBBS స్టూడెంట్ సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌(Adilabad)లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. రిమ్స్‌లో ఎంబీబీఎస్(MBBS) సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ చౌదరి(19) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని వేలాడుతున్న సాహిల్‌ను చూసి.. తోటి విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థి సాహిల్‌(Sahil Chaudhary)ది రాజస్థాన్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story