- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MBBS, BDS మేనేజ్‌మెంట్ కోటా సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షురూ..
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) 2025-26 విద్యా సంవత్సరానికి గాను మేనేజ్‌మెంట్ కోటా (బీ, సీ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) 2025-26 విద్యా సంవత్సరానికి గాను మేనేజ్‌మెంట్ కోటా (బీ, సీ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 4, 2025న మధ్యాహ్నం 3:00 గంటల నుండి అక్టోబర్ 6, 2025న మధ్యాహ్నం 1:00 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. అభ్యర్థులు https://tspvtmedadm.tsche.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆప్షన్లను వినియోగించుకోవాలి. సెప్టెంబర్ 22, 2025న కేఎన్ఆర్ యూహెచ్‌ఎస్ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఫైనల్ మెరిట్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు మాత్రమే వెబ్ ఆప్షన్లకు అర్హులు. మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీటు పొంది, కళాశాలలో చేరి కొనసాగుతున్న అభ్యర్థులు కూడా ఈ దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అర్హులు.
అయితే, మొదటి దశలో సీటు కేటాయించినా రిపోర్ట్ చేయని లేదా కోర్సును నిలిపివేసిన అభ్యర్థులు, అలాగే మొదటి దశలో వెబ్ ఆప్షన్లు ఇవ్వని అభ్యర్థులు ఈ రెండో దశ కౌన్సెలింగ్‌కు అనర్హులు. సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పేమెంట్ గేట్‌వే ద్వారా యూనివర్సిటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్‌కు బీ కేటగిరీ అభ్యర్థులు రూ. 40,000, సీ, ఎన్ఆర్ఐ కేటగిరీ అభ్యర్థులు రూ. 70,000 చెల్లించాలి. ఈ ఫీజు చెల్లించిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న ఏ కోర్సు, కళాశాలకైనా, ఎన్నింటికైనా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ దశలో సీటు కేటాయించబడితే, మొదటి దశలో కేటాయించబడిన సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఆప్షన్లు ఎంచుకోవాలి. సీటు కేటాయించిన అభ్యర్థి, అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న చివరి తేదీలోగా కళాశాలలో చేరకపోతే, వారి అడ్మిషన్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. అటువంటి అభ్యర్థులకు సీటు బ్లాకింగ్‌ను నివారించడానికి తదుపరి రౌండ్లలో అవకాశం ఇవ్వబడదు. మరిన్ని వివరాల కోసం http://knruhs.telangana.gov.in లో చూడవచ్చు.
ఎంబీబీఎస్ 413, బీడీఎస్ 128 సీట్లు
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించిన ఖాళీల వివరాలు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం రెండో దశ కౌన్సెలింగ్‌కు గాను ఎంబీబీఎస్ కోర్సులో 413 సీట్లు, బీడీఎస్ కోర్సులో 128 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపి 526 సీట్లు ఈ దశలో భర్తీకి అందుబాటులో ఉన్నాయని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ లోకల్ కోటా 199, అన్ రిజర్వ్ డ్ 111, ఎన్ఆర్ఐ (సీ కేటగిరీ) 113 సీట్లు ఉన్నాయి. ఇక బీడీఎస్ బీ కేటగిరీలో లోకల్ 76, అన్ రిజర్వ్ డ్ 23, ఎన్ఆర్ఐ కోటా 29 మొత్తం కలిపి 128 బీడీఎస్ సీట్లు ఖాళీలుగా ఉన్నాయి.
అడ్మిషన్లలో మెరిట్ జాబితా సవరణ
కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్ హెచ్ఎస్‌యూ) మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల 2025–26 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం విడుదల చేసిన మెరిట్ జాబితాలో సవరణ చేసింది. ఎన్.ఆర్.ఐ కేటగిరీపై అభ్యర్థులు సమర్పించిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం 50 మంది విద్యార్థులను అర్హులుగా ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఈ మేరకు శనివారం జాబితాను విడుదల చేస్తూ, ప్రవేశాల కోసం సంబంధిత మార్గదర్శకాలను అనుసరించాలని అభ్యర్థులకు సూచించింది.






