- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరాటే విజేతలకు మెడల్స్ ప్రధానం.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
కియో కరాటే ఛాంపియన్ షిప్ 2025 విజేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మెడల్స్ ప్రధానం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కియో కరాటే ఛాంపియన్ షిప్ 2025 (Kio Karate Championship 2025) విజేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) మెడల్స్ (Medals) ప్రధానం (Presentation) చేశారు. హైదరాబాద్ వేదికగా 4వ కియో కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలు ఘనంగా జరిగాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (Sports Authority Of Telangana) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం రోజు నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులతో పాటు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరీన్ (Nikat Jarin) కూడా హాజరయ్యారు.
కియో కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నేటితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజేతలకు మెడల్స్ అందించారు. అంతేగాక ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇలాంటి ఎన్నో పోటీలు నిర్వహించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నెలవు కావాలని కోరుకున్నారు. విజేతలను ఉద్దేశించి ఇలాంటి మరిన్ని పోటీలలో విజేతలుగా నిలిచి, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకొని రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.






