Konda Surekha వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ మంత్రి సురేఖ

by Y. Venkata Narasimha Reddy |

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధి(Vemulawada Rajanna Temple)కి మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వెల్లడించారు.

Konda Surekha వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ మంత్రి సురేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధి(Vemulawada Rajanna Temple)కి మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వెల్లడించారు. సచివాలయంలో దేవాదాయ శాఖ పేషి కాన్ఫరెన్స్ హాలులో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar),, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమీషనర్ హనుమంతు,, వేములవాడ ఈవో వినోద్ లో వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష చేశారు.

మాస్టర్ ప్లాన్, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించడం జరిగింది. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వేముల వాడ ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఆలయ అభివృద్ధి నిధుల మంజూరీపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో చర్చిస్తామన్నారు.

Next Story