రవాణా శాఖలో భారీ బదిలీలు.. 204 మంది అధికారులకు పోస్టింగులు

by Ramesh Naini |

రాష్ట్ర రవాణా శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మే 31వ తేదీతో ఉద్యోగుల బదిలీల గడువు ముగియనుండటంతో రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబరితి బదిలీల ఉత్తర్వులను జారీ చేశారు.

రవాణా శాఖలో భారీ బదిలీలు.. 204 మంది అధికారులకు పోస్టింగులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మే 31వ తేదీతో ఉద్యోగుల బదిలీల గడువు ముగియనుండటంతో రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబరితి బదిలీల ఉత్తర్వులను జారీ చేశారు. చెక్‌పోస్టుల రద్దు, పనిభారం ఆధారంగా పోస్టుల పునర్విభజన చేపడుతూ ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. రవాణా శాఖలో వివిధ కేడర్లకు చెందిన మొత్తం 204 మంది అధికారులను బదిలీ చేశారు.

మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ) 93 మంది, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఏఎంవీఐ)లు 83 మంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏఓ)లు 28 మందికి బదిలీలు అయ్యాయి. మొత్తం 7 జోన్లు, రెండు మల్టీజోన్ల పరిధిలో అభ్యర్థుల అభ్యర్థనలు, పరిపాలనా సౌలభ్యం, స్పౌజ్ గ్రౌండ్స్ ఆధారంగా ఈ బదిలీల ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీలు పొందిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని, సంబంధిత జిల్లా రవాణా అధికారులు దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

Next Story