- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా ప్రమోషన్లు.. అధికారిక ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వైద్య విధాన పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను యుద్ధ ప్రాతిపదికపై భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ కూడా అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ సేవలు మెరుగుపరచడం, ప్రభుత్వం నడిపే ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చడమే తమ లక్ష్యమని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, గత కొంతకాలంగా వైద్య, ఆరోగ్య శాఖలో పదోన్నతుల (Promotions) అంశం పెండింగ్‌లో ఉంది. ఇదే విషయాన్ని ఉద్యోగులు మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodara Rajanarsimha) దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో చర్చించి పదోన్నతులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించారు. వారిలో కృష్ణవేణి, శ్వేత, మంజునాథ్ నాయక్‌లు ఉన్నారు. అదేవిధంగా మరో 36 మంది సివిల్ సర్జన్లకు ప్రమోషన్లు ఇస్తూ సంబంధిత శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.






