భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్

by Ramesh Goud |

సికింద్రాబాద్ (Secunderabad)లో గంజాయి పట్టివేత కలకలం రేపింది.

భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ (Secunderabad)లో గంజాయి పట్టివేత కలకలం రేపింది. కారు (Car)లో తరలిస్తున్న భారీ గంజాయిని (Huge Ganja) పట్టుకున్న పోలీసులు (Police).. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను (Software Employees) అరెస్ట్ (Arrest) చేశారు. జింఖానా గ్రౌండ్స్ (jinkana Grounds) పరిధిలో ఇన్నోవా కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కారులో సోదాలు (Searching) నిర్వహించగా.. దాదాపు 10 కిలోల గంజాయి (10 Kgs Ganja) బయటపడింది. పట్టుబడిన గంజాయిని పోలీసులు సీజ్ (Sieze) చేశారు. నిందితులు ఇద్దరు హైదరాబాద్ (Hyderabad)లో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారని తెలుసుకున్నారు. ఉద్యోగం చేస్తూనే.. ఆంధ్ర నుంచి హైదరాబాద్ కి గంజాయి అక్రమరవాణా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రవీణ్ వర్మ (Praveen Varma) అనే వ్యక్తి ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Siftware Engineer) గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి కంపెనీ ఇచ్చే జీతం సరిపోక ఈ గంజాయి అక్రమ రవాణా కు పాల్పడుతున్నాడని తెలిసింది. ఆంధ్ర- ఒరిస్సా బార్డర్ (Andra Odisha Border) నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు. ఇన్నోవా కారు(Innova Car) డోర్లలో గంజాయి సీల్ చేసిన గంజాయి ప్యాకెట్లు ఉంచి తీసుకోస్తున్నారని, ప్రవీణ్ వర్మ మధ్యలో కారు దిగి వేరే డ్రైవర్ ను ఎక్కించి హైదరాబాద్ పంపించాడని పోలీసులు తెలుసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక వారి నుంచి సెల్ ఫోన్లు, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు.

Next Story