- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BreakingNews : చాక్లెట్ ఫాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
by Muthe.Rajitha |
హైదరాబాద్ (Hyderabad) లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చాక్లెట్ ఫాక్టరీలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చాక్లెట్ ఫాక్టరీలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చాక్లెట్ పొడిని వేడి చేస్తున్నపుడు గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకోగా.. వెంటనే ప్రాణభయంతో తాము బయటకు పరుగులు తీశామని కార్మికులు తెలిపారు. కాగా ఈ ఫాక్టరీ ఇళ్ల మధ్య ఉండటంతో.. దట్టమైన పొగలు, మంటలు రావడంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
Next Story






