KCR: జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-13 14:48:47  IST  )

ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది.

KCR:  జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌చార్జీలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్‌చార్జీలను కేటీఆర్ ఖరారు చేశారు. జగిత్యాలకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోరుట్లకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ ఎల్.రవీందర్‌రావు, వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చొప్పదండికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.

Next Story