- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills: ‘మార్వాడీ గో బ్యాక్’ నేత.. జూబ్లీ హిల్స్ ఎన్నికలో శ్యామ్‌కు ఎన్ని ఓట్లు తెలుసా?
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (98988) భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: (Jubilee Hills by-election) జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (98988) భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ 74259 ఓట్లు సాధించారు. ఇక, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 17061 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. వీరి తర్వాత నోటాకు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. 924 ఓట్లతో నోట నాలుగో స్థానం దక్కించుకుంది. అయితే మార్వాడీ గో బ్యాక్ ఉద్యమ నేతగా పేరు గాంచిన తెలంగాణ శ్యామ్ (పగిడిపల్లి శ్యామ్సన్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయన విడుతలై చిరుతైగల్ కట్చి (Viduthalai Chiruthaigal Katchi) పార్టీ తరఫున పోటీ చేశారు. ఈ పోటీలో తెలంగాణ శ్యామ్ 143 ఓట్లు సాధించారు. కాగా, తెలంగాణ శ్యామ్ ఇటీవల మార్వాడి గో బ్యాక్ సమయంలో ఫేమస్ అయ్యారు. ఆయన మర్వాడీలకు వ్యతిరేక ఆందోళనలలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో మార్వాడీలు ముఠాగా ఏర్పడి స్థానిక వ్యాపారస్థుల పొట్ట కొడుతున్నారని సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఆందోళన చేశారు.






