- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఇంట్లో సోదాలు చేస్తూ నన్నే లోనికి వెళ్లనివ్వరా.. పోలీసులతో మర్రి జనార్దన్ రెడ్డి వాగ్వాదం
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నిక ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్లకు పంచే తాయిలాలపై దృష్టి సారించింది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నిక ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్లకు పంచే తాయిలాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో డబ్బు పంచేందుకు భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారనే సమాచారంతో ఇవాళ మోతీనగర్ (Mothinagar) పరిధిలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి (Marri Janardhan Reddy) ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
దీంతో విషయం తెలుసుకున్న జనార్దన్‌రెడ్డి తన ఇంటి రాగా.. ఇంట్లోని వెళ్లనివ్వకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో జనార్దన్ రెడ్డి.. నా ఇంట్లో తనిఖీలు చేస్తూ నన్నే లోపలికి వెళ్లనివ్వరా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే బ్యాగులను నా ఇంట్లోకి తీసుకెళ్లారని.. డబ్బులు పెట్టించారని ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ (Election Code) అమల్లో లేని ప్రాంతాల్లో అర్థం లేని సోదాలు ఏంటని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందనే ప్రభుత్వం తమపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పోలీసులు తీరు నిరసిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు, పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.






