- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హైదరాబాద్‌లో మా మనుషులు ఉన్నారు.. కాసేపట్లో నిన్ను చంపేస్తాం’.. రఘునందన్ రావు మావోయిస్టుల మరో హెచ్చరిక
తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao)కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao)కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్‌ను తక్షణమే ఆపకపోతే చంపేస్తామని అందులో మావోయిస్టులు(Maoists) పేర్కొన్నారు. తమ మనుషులంతా హైదరాబాద్‌లో ఉన్నారని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. కాగా, రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో రఘునందన్ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు కాల్స్‌పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, ఆయనకు అదనపు భద్రత అవసమని నిర్ణయించింది. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదక్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం నిమిత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణకు వచ్చారు. అమిత్ షా రాష్ట్రంలో ఉన్న వేళ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది.






