- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్చర్ల MLA అనిరుద్ రెడ్డికి మావోయిస్టుల హెచ్చరిక
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన ముదిరెడ్డిపల్లిలో వెలసిన మావోయిస్టుల పోస్టర్ కలకలం రేపుతున్నాయి.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో వెలసిన మావోయిస్టుల పోస్టర్ కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి.. ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేయలేదు అని.. ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ప్రత్యేకించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రవర్తన బాగోలేదు.. పాదయాత్ర చేసిన సమయంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హామీలను విస్మరించారు. అనిరుద్ రెడ్డి అనుచరులు, బినామీలు వ్యవహారాలన్నీ మాకు తెలుసు’ అంటూ కొంతమంది ఎమ్మెల్యే అనుచరుల పేర్లను మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో విగ్రహాలు మాయమైన వ్యవహారంపై కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని లేఖలో రాశారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో వెలసిన ఈ లేఖను చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, రాజపూర్ ఎస్ఐ రవి సారథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లేఖను స్వాధీన పరుచుకొని వివరాల కోసం.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ విషయమై మహబూబ్ నగర్ డీఎస్‌పీ వెంకటేశ్వర్లును ‘దిశ’ వివరణ కోరగా.. లేఖలు లభించిన మాట వాస్తవమే.. కానీ అది ఫేక్ పోస్టర్‌గా భావిస్తున్నామని అన్నారు. ఎవరో వ్యక్తిగత కక్షలతో ఈ పోస్టర్ వేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లుగా డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.






