- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గడ్చిరోలి ఎన్‌కౌంటర్.. కామారెడ్డికి చెందిన మావోయిస్టు ప్రభాకర్ మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు భ్రమగడ్ తాలుకా పొదెవాడ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో తొమ్మిది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో కామారెడ్డికి చెందిన మావోయిస్టు ప్రభాకర్ అలియాస్ చందర్ అలియాస్ పడకల స్వామి మృతి చెందినట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ధారించారు. ప్రభాకర్‌పై రూ.50లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం గడ్చిరోలి డివిజనల్ కమిటీ అధిపతిగా మావోయిస్టు ప్రభాకర్ కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఓ పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే-47 రైఫిల్‌తో సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించుకున్న మార్చి 31 గడుపు సమీపిస్తున్న తరుణంలో వరుస ఎన్‌కౌంటర్లు జరుగడం, కీలక నేతలు మృతిచెందుతుండటం ఉద్యమానికి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తుస్తున్నారు. గడ్చిరోలిలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.






