- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chalapati encounter: రెండు కర్రల సాయం.. 40 గంటల పోరాటం.. చలపతి ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
చలపతి ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి (Maoist Chalapathi) మృతి చెందడంపై మావోయిస్టు పార్టీ తాజాగా స్పందించింది. సెంట్రల్ రీజనల్ బ్యూరో, సీపీఐ(మావోయిస్టు) (Maoist Party Letter) ప్రచార కమిటీ పేరుతో ఓ లేఖ విడుదల చేసింది. చలపతి ఏఓబీ ఉద్యమంతో 32 ఏళ్ల పాటు మమేకమయ్యారని పేర్కొంది. 2020 నుంచి జైరామ్ పేరుతో ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ గరియాబంద్ జిల్లా మైన్ పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరోచితంగా పోరాడుతూ అమరుడయ్యారని పేర్కొంది. ఆయనతో పాటు 16 మంది 40 గంటల పాటు పోరాడి ప్రాణాలు వదిలారని తెలిపింది. చలపతి తీవ్రమైన అనారోగ్యం, నడిచేందుకు కాళ్లు సహకరించకపోయినా రెండు కర్రల సాయంతో కర్తవ్యం కోసం రాష్ట్రాలు దాటి ప్రయాణించారని గుర్తుచేసింది. ఆయన ఆశయ సాధనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చింది.






