Flash News: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-01 19:11:59  IST  )

గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Raja Singh)కు మంగళహాట్ పోలీసులు (Mangalhat Police) నోటీసలు జారీ చేశారు. ఒంటరిగా తిరగవద్దని ఆ నోటీసుల్లో సూచించారు.

Flash News: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Raja Singh)కు మంగళహాట్ పోలీసులు (Mangalhat Police) నోటీసలు జారీ చేశారు. ఒంటరిగా తిరగవద్దని ఆ నోటీసుల్లో సూచించారు. భద్రతా సిబ్బంది, బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా బయటకు వెళ్లొద్దని, ఒంటరిగా తిరగవద్దని తెలిపారు. రాజాసింగ్‌కు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నోటీసులో పేర్కొన్నారు. ఇది ఆయన జీవితానికి ముప్పు కలిగించే పరిస్థితిగా పోలీసులు భావిస్తున్నారు.

రాజాసింగ్ తరచూ భద్రతా సిబ్బంది లేకుండా ఒంటరిగా తిరుగుతున్నారని, ముఖ్యంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలైన తలాబ్‌కట్ట, భవానీ నగర్, ఇంజాబోలి, బాబా నగర్, బహదూర్‌పుర, సంతోష్ నగర్, యాకుత్‌పుర, గొల్కొండ, జిర్రా వంటి ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించారని నోటీసులో ఉంది. మే 31, 2025 రాత్రి 17:00 నుంచి 19:00 గంటల మధ్య ఆయన ఈ ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది లేకుండా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఆయన భద్రత పట్ల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుందని పోలీసులు భావించారు.

ప్రభుత్వం కేటాయించిన (1+4) భద్రతా సిబ్బందిని (ఒక గన్‌మెన్ + నలుగురు సాయుధ సిబ్బంది) తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. ఆయన భద్రత కోసం, ఏదైనా అవాంఛనీయ సంఘటనలను నివారించడం కోసం ఈ చర్యలు తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆయన సహకరించాలని పోలీసులు జారీ చేసిన నోటీసుల్లో కోరారు.

Next Story