- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణపై ఆంధ్ర నాయకుల పెత్తనమేంటి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధం అవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ జ్ఞాని అయిన నాగేశ్వర్ పై ఏపీ పోలీసులు కేసులు పెడతారా అని మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధం అవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ జ్ఞాని అయిన నాగేశ్వర్ పై ఏపీ పోలీసులు కేసులు పెడతారా అని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు జూబ్లిహిల్స్ పని ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ మేధావులపై చేస్తున్న అరాచకపాలన నడవదు అని హెచ్చరించారు. ఆంధ్రకు ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా రావడంలేదని కానీ తెలంగాణకు వస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. బతకడానికి వచ్చినవాళ్లు బతకడానికి వచ్చినట్టు ఉండాలని కానీ పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అరవై ఏళ్లపాటు కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే మళ్లీ హైదరాబాద్ వచ్చి ఆగం చేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
అవసరమైతే ఏపీ నాయకులకు మరోసారి వ్యతిరేకంగా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇటీవల అమిత్ షా, పవన్ కల్యాణ్ ల భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా, పవన్ మధ్య ఇలాంటి సంభాషణ జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలు పోలీస్ స్టేషన్ లలో నాగేశ్వర్ రావుపై జనసేన నాయకులు కేసులు నమోదు చేశారు. నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ నుండి పోలీసులు వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. తరవాత ఏపీ ఫ్యాక్ట్ చెక్ అవి ఫేక్ వార్తలు అంటూ పేర్కొంది. కానీ మళ్లీ పవన్ కల్యాణ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్‌కు పోలీసులు సిద్ధమైతే తానే అడ్డుకున్నానని చెప్పారు. దీంతో నాగేశ్వర్ రావు, పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.






