- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మందకృష్ణ మాదిగకు పద్మశీ అవార్డు

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga)కు పద్మశ్రీ(Padma Sri) అవార్డు వరించింది. ఏపీ(Ap), తెలంగాణ(Telanga)లో ఆయన చేసిన సామాజిక సేవలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna), మందకృష్ణ మాదిగతో పాటు పలువురు తెలుగువాళ్లకు సైతం పద్మ అవార్డులు దక్కాయి. దీంతో మందకృష్ణ మాదిగ అనుచరులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నారు.
కాగా వరంగల్ జిల్లా హంటర్ రోడ్డు శాయంపేటకు చెందిన మందకృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)ని ఏర్పాటు చేశారు. 1994లో ప్రకాశం జిల్లాలోని చిన్నగ్రామం ఈదుమూడి నుంచి 20 మంది యువకులతో ‘మాదిగ దండోరా’ అంటూ పోరాటం సాగించారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని సుదీర్ఘ కాలం ఉద్యమం చేశారు. ఆయన చేసిన పోరాట ఫలితంగా ఎస్సీ వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇటీవల ప్రధాని మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం ఉంది.