- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఐ నారాయణతో మందకృష్ణ మాదిగ భేటీ
సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ శుక్రవారం తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ శుక్రవారం తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. సుమారు గంటసేపు ఎస్సీ వర్గీకరణ, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు, కులగణన మొదలైన అంశాల గురించి ఇరువురు చర్చించారు. ప్రస్తుతం దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవశ్యకత ప్రజాస్వామిక వాదులపై ఉన్నదని గుర్తు చేసుకున్నారు. చిన్నచిన్న అంశాలను పక్కన పెట్టి, భిన్నాభిప్రాయాలు గౌరవిస్తూనే విశాల ప్రజా ఆకాంక్షల మేరకు కలిసి పనిచేయాల్సిన అవసరముందని నారాయణ గుర్తు చేశారు.
అంతే కాకుండా మందకృష్ణ మాదిగను పద్మశ్రీ అవార్డ్ వరించినందుకు గాను ఈ సందర్భంగా నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. పద్మ శ్రీ అవార్డు పట్ల గతంలో భిన్నమైన అభిప్రాయం వుండేదని, కానీ పద్మశ్రీ అవార్ట్ ను మందకృష్ణకు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని గతంలో మీడియా ముందు కూడా తాను మాట్లాడినట్లు నారాయణ గుర్తు చేశారు. నమ్మిన ఆశయం, ఎత్తుకున్న ఎజెండా, మూడు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాట ఫలితమే ఈ పద్మశ్రీ అవార్డ్ అని నారాయణ కొనియాడారు.






