‘దళితుడు కాబట్టే దాడి చేశారు’.. మందకృష్ణ మాదిగ ఫైర్

by Gantepaka Srikanth |

సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌(Justice BR Gavai)పై అక్టోబరు 6న జరిగిన దాడి జరిగిన విషయం తెలిసిందే.

‘దళితుడు కాబట్టే దాడి చేశారు’.. మందకృష్ణ మాదిగ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌(Justice BR Gavai)పై అక్టోబరు 6న జరిగిన దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి నిరసనగా ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ఢిల్లీలో సభ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ సభకు ఢిల్లీ పోలీసులు(Delhi Police) అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని స్వయంగా మందకృష్ణ మీడియాకు వివరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీజేఐకి మద్దతుగా ఢిల్లీలో సభ పెట్టాలని భావించాం.. సభకు అనుమతి ఇవ్వకపోవడం పౌర హక్కులను హరించడమే.. సీజేఐ(CJI) దళితుడు కాబట్టే దాడికి యత్నించారని మందకృష్ణ మండిపడ్డారు. ఢిల్లీకి చెందిన వారు ధర్నా చేస్తే అనుమతి ఇచ్చారు.. ఇతర ప్రాంతాల వారికి అనుమతి ఇవ్వరా? అని ఫైర్ అయ్యారు.

నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీజేఐపై దాడికి ప్రయత్నిస్తే దేశ వ్యవస్థలన్నీ చర్యలకు ఉపక్రమించకుండా.. మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని మండిపడ్డారు. జస్టిస్‌ గవాయ్‌ స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులుంటే ఈ తరహా ఘటన జరిగేదా? సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా కేసును ఎందుకు స్వీకరించలేదు? జస్టిస్‌ గవాయ్‌కి న్యాయం జరగాలని జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాం. ఆయనపై దాడియత్నం విషయంలో రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయి. రాజ్యాంగ రక్షణ, దళితులపై దాడులను ఎదుర్కోవడం కోసమే ఢిల్లీలో సభ పెట్టినట్లు మందకృష్ణ చెప్పుకొచ్చారు.

Next Story