ప్రచారానికి డబ్బులు లేక ఆత్మహత్య.. తీరా చూస్తే సర్పంచ్‌గా భారీ విజయం

by Malleboina Mahesh |   (  Updated:2025-12-14 15:15:04  IST  )

సంగారెడ్డి జిల్లాలోని పిపడ్‌పల్లి పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితం యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు, గ్రామస్తులు మరణించిన అభ్యర్థి రాజుకే పట్టం కట్టడం అనూహ్య ఘట్టంగా నిలిచింది.

ప్రచారానికి డబ్బులు లేక ఆత్మహత్య.. తీరా చూస్తే సర్పంచ్‌గా భారీ విజయం
X

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలోని పిపడ్‌పల్లి పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితం యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు, గ్రామస్తులు మరణించిన అభ్యర్థి రాజుకే పట్టం కట్టడం అనూహ్య ఘట్టంగా నిలిచింది. ఈనెల 8వ తేదీన ఆత్మహత్య చేసుకున్న రాజు, నేడు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల ఖర్చుల కోసం డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన జరిగినప్పటికీ, గ్రామంలోని ఓటర్లు రాజుపై తమకున్న నమ్మకాన్ని, ఆయన పరిస్థితిపై తమ సానుభూతిని వ్యక్తం చేస్తూ, మరణానంతరం కూడా ఆయన్నే సర్పంచ్‌గా ఎన్నుకోవడం భావోద్వేగభరితంగా మారింది. పిపడ్‌పల్లి గ్రామస్తుల ఈ నిర్ణయం, స్థానిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం కంటే, అభ్యర్థి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణే ముఖ్యమని మరోసారి నిరూపించింది. ఎన్నికల ప్రచారానికి, ఖర్చుల నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులు లేవనే ఒత్తిడితో రాజు ఆత్మహత్య చేసుకోవడం, ఈ ఎన్నికల వ్యవస్థలోని ఆర్థికపరమైన సవాళ్లకు అద్దం పడుతోంది.

Next Story