జగిత్యాలలో వింత ఘటన.. తన సమాధి తానే నిర్మించుకున్న వ్యక్తి

by Ajay Maddhiboyina |

జగిత్యాల జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇందయ్య అలియాస్ జాన్ అనే వ్యక్తి బతికి ఉండగానే తన సమాధిని తానే నిర్మించుకున్నాడు.

జగిత్యాలలో వింత ఘటన.. తన సమాధి తానే నిర్మించుకున్న వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇందయ్య అలియాస్ జాన్ అనే వ్యక్తి బతికి ఉండగానే తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చిన ఇందయ్య 2009తో సొంత భూమి కొనుగోలు చేసి సమాధిని నిర్మించుకున్నాడు. తన పిల్లలకు భారం కావొద్దని సుమారు రూ.8 లక్షలతో ఈ సమాధిని నిర్మించుకున్నాడు.

కాగా ఇందయ్య నిన్న కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా ఆయన నిర్మించుకున్న సమాధి వద్దనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇందయ్య బతికున్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో సాయంత్రం సమయాల్లో తాను నిర్మించుకున్న సమాధి వద్ద కూర్చుని పాటలు పాడుకుంటానని చెప్పాడు. దుబాయ్ నుండి వచ్చిన అనంతరం గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో ప్రజలు ఆయనను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Next Story