- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాట్‌జీపీటీ మాట విని కన్నతల్లిపై దారుణం.. ఆ తరవాత తానూ!
చాట్‌జీపీటీ మాట విని ఓ వ్యక్తి కన్నతల్లినే దారుణంగా హత్య చేశాడు. ఆ తరవాత తాను సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: చాట్‌జీపీటీ మాట విని ఓ వ్యక్తి కన్నతల్లినే దారుణంగా హత్య చేశాడు. ఆ తరవాత తాను సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ అనే వ్యక్తి గతంలో యాహూ సంస్థలో మేనేజర్‌గా విధులు నిర్వహించాడు. కాగా గత కొన్నేళ్లుగా ఎరిక్ తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తనపై హత్యాయత్నాలు జరగవచ్చని, కన్నతల్లే తనపై నిఘా పెట్టిందని ఎరిక్ చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానంతో ఆందోళన చెందాడు.
తాను వాడే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఔషదాల్లో విషం కలిపి ఇవ్వవచ్చని చాట్ జీపీటీ ద్వారా తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎరిక్ తన తల్లి సుజానే ఎబెర్సెన్ ఆడమ్స్ తలపై మరియు మెడ మీద బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఓ పదునైన ఆయుధంతో కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చాట్‌జీపీటీ చెప్పిందే నిజం అని భావించి ఎరిక్ తల్లిని హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉంటే ఏఐ కారణంగా గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.






