ఇందిరమ్మ ఇల్లు కావాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

by Ajay Maddhiboyina |

ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్ధిదారుల జాబితాలో త‌న పేరు లేద‌ని వ్య‌క్తి వాట‌ర్ ట్యాంక్ ఎక్కి నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఇందిరమ్మ ఇల్లు కావాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్ధిదారుల జాబితాలో త‌న పేరు లేద‌ని వ్య‌క్తి వాట‌ర్ ట్యాంక్ ఎక్కి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి మండ‌లం వెలుగుప‌ల్లిలో చోటు చేసుకుంది. ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల జాబితా విడుద‌ల కాగా అందులో త‌న పేరు లేద‌ని గ్రామానికి చెందిన క‌న‌కయ్య ఆందోళ‌న చెందారు. నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ వాట‌ర్ ట్యాంక్ ఎక్క‌డంతో పోలీసులు, గ్రామ‌స్తులు న‌చ్చ‌జెప్ప‌డంతో క‌న‌క‌య్య కిందికి దిగాడు.

గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయ‌కుడు రూ.50వేలు లంచం అడిగాడ‌ని, రూ.20వేలు ఫోన్ చేసినా లిస్టులో త‌న పేరు రాలేద‌ని క‌న‌కయ్య ఆరోపిస్తున్నాడు. మ‌రోవైపు మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం ముదిగొండ మండ‌లం కిష్టాపురం గ్రామంలో అర్హుల‌కు ఇందిర‌మ్మ ఇల్లు ఇవ్వ‌కుండా ఉద్యోగాలు, భూములు ఉన్నవారికి ఇచ్చార‌ని అధికారుల‌ను పంచాయితీ కార్యాల‌యంలో పెట్టి గ్రామ‌స్థులు తాళం వేశారు.

Next Story