- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారని పీఎస్ ముందు వ్యక్తి ఆత్మహత్యయత్నం
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటిచుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటిచుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుండగా రావిళ్ల నరసింహ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం స్టేషన్ కు వెళ్లిన అతడు కేసు పెట్టడంతో ఆందోళనకు దిగి తన వెంట తెచ్చుకున్ని పెట్రోల్ పోసుకుని నిప్పింటిచుకున్నాడు. నా పైనే కేసు నమోదు చేస్తారా అంటూ పోలీసులను నిలదీస్తూ ఆత్మహత్యయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పక్కనే ఉన్న పోలీసులు వచ్చి మంటలు ఆర్పి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు త్వరగా స్పందించడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో






