Malreddy Rangareddy: మంత్రి పదవి నాకే.. మల్‌రెడ్డి రంగారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna)పై కాంగ్రెస్ (Congress) అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన వేళ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Rangareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Malreddy Rangareddy: మంత్రి పదవి నాకే.. మల్‌రెడ్డి రంగారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌‌డెస్క్: తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna)పై కాంగ్రెస్ (Congress) అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన వేళ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Rangareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) ఉండబోతోందని కామెంట్ చేశారు. హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Ranga Reddy) జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి గెలిచి నిలిచింది తానొక్కడినే అని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధిష్టానంతో పాటు ఏఐసీసీ (AICC) పెద్దలు కూడా మంత్రివర్గ విస్తరణ విషయంలో ప్రాధాన్యతను ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ సామాజిక సమీకరణల వల్ల అది సాధ్యపడకపోతే వేరే వాళ్లను తానే స్వయంగా దగ్గరుండి గెలిపించమన్నా దగ్గరుండి గెలిపిస్తానని అధిష్టానానికి విన్నవించానని తెలిపారు. ఏది ఏమైనా రాబోయే మంత్రివర్గ విస్తరణలో తనుకు మంత్రి పదవి ఖాయమని మల్‌రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Next Story